దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి :-
తెలంగాణా వారోత్సవాలు ముగింపు సందర్భంగా సిపిఎం పార్టీ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని జమేదార్ బంజర్ గ్రామంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ సోయంగంగులు స్మారక స్థూపం వద్ద సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ మెంబెర్ కొక్కెర పాటి పుల్లయ్య హాజరైనారు, మొట్టమొదట సోయంగంగులు స్మారక స్థూపం వద్ద పార్టీ జెండాను పుల్లయ్య ఎగుర వేశారు. గంగులు గారి స్తూపానికి పూలమాల ను పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది వక్తలు గా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెర పాటి పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ దొడ్డా లక్ష్మి నారాయణ లు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం 1946సంవత్సరం జులై 4. న దొడ్డి కొమురయ్య మరణంతో మొదలైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1951సంవత్సరంఅక్టోబర్వరకుసాగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో మట్టి మనుషులు చేసిన ది చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా పేరు కలిగిన తను4ఎకరాలు పొలం కౌలు కు చేసి పంట పండిస్తె ఆపంటను కోత కోయనివ్వకుండా జాగీరు దారు రౌడిమూకలు అడ్డు తగలగా ఆంధ్ర మహాసభ సంఘం కమ్యూనిస్టు పార్టీ వారు సాయుధలై పోరాటం చేసి భూస్వాములు గుండాలు ను తురిమి కొట్టి చాకలి ఐలమ్మ వరి ధాన్యం బస్తాలు తోలుకొచ్చి ఐలమ్మ ఇంట్లో పోశారు విజయం తో మొదలైన పోరాటం. 10 లక్షలు ఎకరాలు భూమిని సాధించి 3 వేలు గ్రామాలు విముక్తి చేశారు
పై భూములు పేదలకు సంఘం వారు పంచారు. ఈ పోరాటంలో పాల్గొన్న వారిలో 4. వేలమంది నైజాం సైన్యం. అశువులు బాశారు
ఈప్రాంతంలో సోయంగంగులు జమీందారు లు కు జాగీరు దారులకు దేశ్ ముఖులకు వ్యతి రేకంగా వారి దౌర్జన్యాలు కు వారి ఆగడాలకు వ్యతిరేకంగా నిలబడి సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని పేదలు కష్టజీవులకు అండగా నిలిచిన బొబ్బిలి పులి. మన్యం వీరుడు అమరజీవి సోయంగంగులు అని ఘనంగా నివాళులు అర్పించారు.
పై తెలంగాణా పోరాటం తో ఎట్టి సంబంధమూ లేని కేంద్ర ప్రభుత్వం ఈ పోరాటానికి వక్రభాష్యం చెబుతున్నారు. ఇది చాలా తప్పుడు ప్రచారం
వాస్తవం గా పోరాటంలో ముస్లిం లు పోరాటం లో చాలా మంది మరణించారు.
తప్పుడు అబద్ధపు ప్రచారాలు ను తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండించుతున్నది
ఈపోరాటం కమ్యూనిష్టులు మాత్రమే చేశారు అనిఅన్నారు.
ఇంకా ఈ సభలో పార్టీ మండల కమిటీ సభ్యులు కొలిక్కి పోగు శ్రీనివాసరావు. కొప్పుల శ్రీనివాసరావు సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు. జగన్నాథ పు శ్రీనివాసరావు కౌలూరి రామకృష్ణ. రావుల శోభన్ బాబు కణితి బాబూరావు. మిద్దెన బాబూరావు. కణితి లక్ష్మి మోటేపల్లి ధర్మయ్య లు పాల్గొన్నారు
సోయం గంగులు అనుచరులు. ఎర్రన్నపేట వాసి
అమరజీవి కామ్రేడ్ కణితి బుల్లయ్య స్తూపం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి. బుల్లియ్య చిత్రపటానికి పూలమాల వేశారు
పైన పేర్కొన్న పార్టీ నాయకులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు


