నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 17:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుర్వి మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు వలందాస్ మహేష్ గౌడ్ (ఉప సర్పంచ్), బత్తుల అనూష మహేష్ గౌడ్, పాలం వెంకటేశం గౌడ్, ముద్దం లింగస్వామి గౌడ్, దొడ్ల అండాలు సెట్టయ్య గౌడ్, దండుగల వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి గంగాపురం పాండుగౌడ్, ఉపాధ్యాయులు దశరథ్, నల్ల జయప్రద, సప్పిడి కల్పన, బొల్లు అండాలు, పర్ని శ్రీధర్ రెడ్డి, మోడెం కృష్ణయ్య, యాట మహేందర్, దండుగల జంగయ్య, దండుగల నాగరాజ్తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


