నవపక్షం, నల్లగొండ రూరల్ ప్రతినిధి :
నల్గొండ మండలం, రసూల్పూర్:
రసూల్పూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తీగల అమృత శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అయితే ఈ విషాద సమయంలోనూ అమృత కుటుంబ సభ్యులు తీసుకున్న మానవతా నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంది. ఆమె నేత్రాలను దానం చేసి, రెండు కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. తమ ఆత్మీయురాలిని కోల్పోయిన బాధలోనూ ఇతరులకు చూపును అందించాలనే ఆలోచన చేయడం ఆదర్శనీయమని బంధువులు, గ్రామస్థులు కొనియాడారు.
ఈ సందర్భంగా గ్రామ మాజీ ఉపసర్పంచ్ గుండెబోయిన సైదులు, తీగల శంకర్, జలంధర్ తదితర గ్రామస్థులు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి మానవతా నిర్ణయాన్ని అభినందించారు.

