నవపక్షం, హైదరాబాద్:
ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా షాపూర్ నగర్ డివిజన్, న్యూ ఎల్‌బీ నగర్‌లోని శారదా విద్యా భవన్ హై స్కూల్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ, అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. యుద్ధాలు, హింస, విద్వేషాలు పెరుగుతున్న నేటి ప్రపంచంలో శాంతి అనేది కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదని, న్యాయం, సమానత్వం, మానవ గౌరవం, పరస్పర విశ్వాసం, సహజీవనానికి శాంతి పునాది అని అన్నారు.
ప్రపంచ శాంతి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ భూపాల్ రెడ్డి, వెబ్ట్రైక్స్ సందీప్ బల్లెం, ఉపాధ్యాయ బృందం సభ్యులు రాఘవేందర్, శ్రావణి, అమరావతితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.


