నవపక్షం, దుబ్బాక:
దుబ్బాకలో కత్తి కార్తీక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుడిని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కళ్యాణి యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కత్తి కార్తీకతో కలిసి నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని కత్తి కార్తీక ఆధ్వర్యంలో భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కళ్యాణి యాదవ్ అన్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో సేవాభావం, ఐక్యత, సోదరభావం మరింత పెంపొందుతాయని ఆమె పేర్కొన్నారు. వినాయక ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో కత్తి కార్తీక, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కళ్యాణి ప్రకాష్ యాదవ్ దంపతులతో పాటు నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


