నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :
శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పూజారి పులి రామకృష్ణ శర్మ ఈసందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు బాగా పండి రైతు లు ఆనందం గా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం గ్రామానికి చెందిన కీర్తి శేషులు కుర్ర లింగయ్య.లింగమ్మ ల ఆర్థిక సహకారం తో దంపతులు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం చేపట్టారు. గ్రామం లోని భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ శీలం అనిత శంకర్,ఉపసర్పంచ్ రంగు రాములు గౌడ్,రంగు రాములు,వరికుప్పల నరసింహ, రంగు గణేష్,పల్స శ్రీనివాస్, రంగు పూర్ణి,రామసాని చరణ్, కుర్ర గణేష్,బొమ్మగాని బాలరాజు,రంగు స్వాతి,సువర్ణ,శ్రీధర,ప్రమీల తదితరులు పాల్గొన్నారు.


