నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యువ నటుడు కిరణ్ అబ్బవరం వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి డివిజన్ పరిధిలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా ఇన్చార్జి బండి దీక్షిత్ కిరణ్ అబ్బవరంను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బండి దీక్షిత్ మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం తన ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడని అభినందించారు. యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా మరింత మంచి చిత్రాల్లో నటిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ కలిగిన నూతన యువ నటులకు మరిన్ని అవకాశాలు లభించాలని, యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దీక్షిత్ పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక కథాంశాలతో కూడిన చిత్రాల్లో కిరణ్ అబ్బవరం మరింతగా నటించాలని కోరారు.
సినిమా కేవలం వినోదానికే పరిమితం కాకుండా యువతకు మంచి ఆలోచనలు, స్ఫూర్తి, సామాజిక బాధ్యతను కలిగించేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరంతో దీక్షిత్ కొద్దిసేపు స్నేహపూర్వకంగా ముచ్చటించారు.


