నవపక్షం, తుంగతుర్తి:
శ్రీశ్రీశ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో జాంబవంత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాన్ని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు డా. గాదరి కిశోర్ కుమార్ గారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం గణనాథుని ఆశీస్సులతో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు, ఐక్యత, సోదరభావం మరియు సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో గణనాథుని ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జాంబవంత యూత్ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


