ధర్మపురి కాలనీ సాయిబాబా ఆలయంలో రెండు లడ్డూలను దక్కించుకున్న మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్

నవపక్షం, ఉప్పల్ ప్రతినిధి:

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీరప్పగడ్డ డివిజన్ పరిధిలోని ధర్మపురి కాలనీ శిరిడీ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన లడ్డూ వేలం పాట, లక్కీ డ్రాలో చిల్కానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ దంపతులకు ఒకేసారి రెండు లడ్డూలు దక్కాయి.

నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న 10 కిలోల లడ్డూను నిర్వహించిన వేలం పాటలో రూ.1,05,000లకు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ దక్కించుకున్నారు. అదే సమయంలో ఆలయ కమిటీ నిర్వహించిన రూ.51 లక్కీ డ్రా కూపన్ కార్యక్రమంలో సుమారు 600 మంది పాల్గొనగా, అందులో 5 కిలోల లడ్డూ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్‌కు లభించింది.

ఒకే ఉత్సవంలో నిర్వహించిన వేలం పాటతో పాటు లక్కీ డ్రాలోనూ లడ్డూలు దక్కడం విశేషమని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా 10 కిలోల లడ్డూను బన్నాల ప్రవీణ్ ముదిరాజ్‌కు, 5 కిలోల లడ్డూను బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్‌కు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు పవిత్రంగా పూజలు అందుకున్న లడ్డూలు ఒకే కుటుంబానికి రెండుసార్లు దక్కడం శుభసూచకమని అన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ప్రజాసేవలో బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ దంపతులు కొనసాగుతున్నారని పేర్కొన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

అనంతరం నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి కాలనీ సాయిబాబా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మాణిక్ ప్రభు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.