తెలంగాణ జర్నలిస్టు జేఏసీ 9 జిల్లాల అధ్యక్షుల నియామకం.. – ఉత్తర్వులు జారిచేసిన జేఏసీ చైర్మన్ తొగరి కరుణాకర్ 

నవపక్షం, హైదరాబాద్ :

తెలంగాణ జర్నలిస్టు జేఏసీ నుండి 9 జిల్లాల అధ్యక్షులుగా నియమితులయ్యారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ తొగరి కరుణాకర్, ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా నుండి కంపాటి శ్రీనివాసరావు, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులుగా విస్లావత్ దశరథ్, వనపర్తి జిల్లా అధ్యక్షులుగా జి. రవి, ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా గుగులోతు బావుసింగ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా బానోతు రవీంద్రనాథ్, వరంగల్ జిల్లా అధ్యక్షులుగా వల్లి ప్రశాంత్, నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా చింతపండు నర్సయ్య, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా అబ్బా కరుణాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రెడ్డిమల్ల సత్యంలను నియమిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేశారు. సమాజ సేవ కోసం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉంటూన్న జర్నలిస్టులకు సమతుల్య న్యాయం జరగడం లేదని, అలాగే వివిధ శాఖలకు ఎమ్మెల్సీలు ఉన్నట్లే జర్నలిస్టుల కూడా గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిందేనని చైర్మన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై శాసనమండలిలో గళం వీప్పేందుకు గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీలు ఇచ్చినట్లయితే జర్నలిస్టులకు సమన్వయ న్యాయం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్సీ సాధనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరూ తెలంగాణ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ లో (జేఏసీలో) చేరాలని పిలుపునిచ్చారు. త్వరలో జరిగే హైదరాబాద్ కేంద్రంగా జర్నలిస్టుల సమరభేరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని మన డిమాండ్లు నెరవేరేవరకు పోరాటం చేయాలని తెలిపారు. మాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పిన జేఏసీ చైర్మన్, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.