నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :
తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం (TRSV) రాష్ట్ర ఇంచార్జ్‌గా వల్లకొండ అజయ్ రెడ్డిని నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలకు సంబంధించిన విద్యార్థి విభాగ కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసే బాధ్యతలను అజయ్ రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వల్లకొండ అజయ్ రెడ్డి మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వాటిని సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
జూనియర్ కాలేజీ నుంచి పీజీ కాలేజీ వరకు రాష్ట్రవ్యాప్తంగా TRSV విద్యార్థి విభాగం కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి కళాశాలలో విద్యార్థులను సమన్వయం చేస్తూ, వారి సమస్యలను తెలుసుకుని కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.
విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేసి, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలను విస్తరించేందుకు కృషి చేస్తానని అజయ్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల హక్కులు, విద్యా సమస్యలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై విద్యార్థుల తరఫున నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.
వల్లకొండ అజయ్ రెడ్డి నియామకంపై పలువురు విద్యార్థి నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


