Sunday, November 8, 2026

మోదీ సేవా స్ఫూర్తితో విద్యార్థుల ప్రతిభకు గునుపూడి హరిబాబు ప్రోత్సాహం

నవపక్షం, గూడూర్ ప్రతినిధి :

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ – వికసిత్ భారత్ మన సంకల్పం కార్యక్రమంలో భాగంగా కోట మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఇందులో భాగంగా మంగళవారం కోట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఏవీకేఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.

బీజేపీ కోట మండల అధ్యక్షుడు గునుపూడి హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులను మూడు విభాగాలుగా విభజించి చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రతి విభాగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.

రెండు పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన 15 మంది విద్యార్థిని, విద్యార్థులకు గునుపూడి హరిబాబు తన సొంత నిధులతో మెమొంటోలు, బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా గునుపూడి హరిబాబు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.

దేశ అభివృద్ధితో పాటు విద్యార్థులు, యువతలో ప్రతిభను వెలికితీయడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలకు వేదికగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం కూడా సమాజానికి చేసే సేవలో భాగమేనని అన్నారు. చిన్న వయసులో విద్యార్థులకు అందించే ప్రోత్సాహం వారి భవిష్యత్తులో గొప్ప ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని గునుపూడి హరిబాబు సూచించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్. వెంకటేశ్వర్లు, విశ్వనాథ్, సాయి, చంద్రసేన కుమారి, పరుశురాం తదితరులు పాల్గొని విజేతలైన విద్యార్థులను అభినందించారు. పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.