నవపక్షం, గూడూరు ప్రతినిధి :
కోట మండలం విశ్వనాథపుర అగ్రహారం గ్రామానికి చెందిన కర్లపూడి మస్తానయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల్లో విషాదం నెలకొంది.
మస్తానయ్య మృతి విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మస్తానయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మస్తానయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని నెల్లూరు మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మస్తానయ్య కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


