చంద్రశేఖరపురం వీధుల్లో ఇక వెలుగులే వెలుగులు

నవపక్షం, గూడూరు ప్రతినిధి :

కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం గ్రామంలో వీధిలైట్ల సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలోని 120 విద్యుత్ స్తంభాలకు కొత్త వీధిలైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామ వీధులు వెలుగులతో కళకళలాడుతున్నాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డా. పాశిం సునీల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామంలోని పలు ప్రాంతాల్లో వీధిలైట్లు లేక రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి, షేక్ అక్బర్ బాష, షేక్ మస్తాన్ బాషలు గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. పాశిం సునీల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి వీధిలైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.

ఎమ్మెల్యే ఆదేశాలు, అధికారుల సహకారంతో మంగళవారం గ్రామంలోని 120 విద్యుత్ స్తంభాలకు కొత్త లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రివేళల్లో గ్రామ ప్రజలకు మెరుగైన వెలుతురు అందడంతో పాటు వారి భద్రతకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు.

గ్రామ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకున్న డా. పాశిం సునీల్‌కుమార్‌కు చంద్రశేఖరపురం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేసిన టీడీపీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి వెంట టీడీపీ నాయకుడు బూచి సుబ్రహ్మణ్యం యాదవ్ పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.