నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:
గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకుడికి కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగూడెం కాలనీలో సుందరంగా గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూలమాలలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వినాయకుడికి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు గద్దపాటి మహేష్ పాల్గొని శ్రీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించి గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గద్దపాటి మణి, రాజు, సాయి, శివ, గోపి, చింటూ, చంటి తదితరులు పాల్గొన్నారు.

