నవపక్షం, హైదరాబాద్ :
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారదను తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయినపల్లి రేఖ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నేరెళ్ల శారదకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మహిళల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణతో పాటు సాధికారత కోసం నేరెళ్ల శారద చేస్తున్న సేవలు మరింత విజయవంతంగా కొనసాగాలని బోయినపల్లి రేఖ గౌడ్ ఆకాంక్షించారు.
మహిళలకు న్యాయం, భద్రత, సమాన అవకాశాలు కల్పించే దిశగా మహిళా కమిషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. మహిళల సమస్యల పరిష్కారానికి నేరెళ్ల శారద నాయకత్వంలో మరింత కృషి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


