కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి :

ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఇంట్లో పేద మహిళలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. వర్షం పడితే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడడంతో చివరకు గ్రామంలోని పీర్ల కొట్టంలో తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తమ దీనస్థితిని అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఇటుకులహాడ్ గ్రామానికి చెందిన గండెల వెంకమ్మ, రేపని పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో వర్షం వచ్చిన ప్రతిసారీ నీరు ఇంట్లోకి చేరుతోందని బాధితులు తెలిపారు. గోడలు, పైకప్పు బలహీనంగా మారడంతో ఇంట్లో నిలబడాలన్నా, కూర్చోవాలన్నా భయంగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. రాత్రివేళ వర్షం పడితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోయారు.

పేదరికం కారణంగా సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్థోమత తమకు లేదని, ప్రభుత్వం అందించే గృహ పథకమే తమకు ఏకైక ఆశ అని బాధితులు పేర్కొన్నారు. వర్షం నుంచి రక్షణ కోసం ఇంట్లో ఉండలేక పీర్ల కొట్టంలో తలదాచుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమ పరిస్థితిని అధికారులు పరిశీలించి, ప్రమాదకరంగా ఉన్న ఇంటిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రాణనష్టం జరిగే వరకు వేచి చూడొద్దు

ప్రస్తుతం ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపడుతున్న నేపథ్యంలో తమలాంటి నిరుపేదలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్హతలను పరిశీలించి నిబంధనల ప్రకారం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఇల్లు పూర్తిగా కూలిపోయి ప్రాణనష్టం సంభవించిన తర్వాత స్పందించకుండా, ముందుగానే అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. “కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? మేము కూడా మనుషులమే.. మా ప్రాణాలకు విలువ లేదా? మా పరిస్థితిని ఒక్కసారి చూసి న్యాయం చేయండి” అంటూ గండెల వెంకమ్మ, రేపని పద్మ కన్నీటితో వేడుకుంటున్నారు.

తక్షణమే సంబంధిత అధికారులు గ్రామాన్ని సందర్శించి శిథిలావస్థలో ఉన్న ఇంటిని పరిశీలించి, అర్హత ఉంటే ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Hot this week

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

  నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

  నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Topics

పంచాయతీ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం గూడలి గ్రామంలోని స్వర్ణముఖి బ్రిడ్జి...

భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి:  మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో...

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.