నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :
మండలం రసూల్పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత మృతి చెందిన విషయం తెలుసుకున్న నల్గొండ మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి , ఈ విషయాన్ని గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన మంత్రి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలుక సైదిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గోలి సైదులు,గుండెబోయిన సైదులు తదితర గ్రామస్థులు పాల్గొన్నారు గుండెబోయిన సైదులు, తదితరులు పాల్గొన్నారు.


