పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :

భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు వస్కుల సుధాకర్ అధ్యక్షతన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ రాష్ట్ర కార్యదర్శి వనం పుష్పలత మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, దేశం మరియు సమాజం పట్ల అంకితభావంతో పనిచేసిన మహనీయుడని అన్నారు. సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతే లక్ష్యంగా ఏకాత్మ మానవతావాదం అనే గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని తెలిపారు.

ఆయన చూపిన మార్గంలో ప్రతి కార్యకర్త నడుస్తూ, సమాజంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేయాలని వారుపిలుపునిచ్చారు. దేశ సేవ, సమాజ సేవ పట్ల పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు సముద్రాల సహదేవ్ చిలక రాజు బిక్కు నేతాళ్ళ వెంకటేశ్వర్లు వనం జగదీశ్వర్ ఈడెం రవి మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బెల్దే మాధవి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం ఉదయ్ జల్ద గీతారాణి పట్టణ కోశాధికారి నీల సుమన్ గంజి హరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర బిక్షపతి పున్న నాగరాజు మునగపాటి చంద్రకళసంపంగి సైదులు తిరుపతి గౌడ్ మావూరి గారి వెంకటేష్ బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారికి ఘన నివాళులు అర్పించారు.

Hot this week

కోడూరు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి

  నవపక్షం, కొత్తపల్లిగోరి ప్రతినిధి : మండల కేంద్రంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరు...

రంగ కవిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  మహిళా నాయకురాలు, యాదాద్రి భువనగిరి...

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

Topics

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.