నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి :
రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో శ్రీ పుట్ట హనుమాన్ నగర్ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజాపేట ఎస్సై మహమ్మద్ తక్యుద్దీన్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.


