నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :
తెలంగాణ వీరనారి,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శనివారం మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రజక సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ దొరల దోపిడీకి,భూస్వాముల అణిచివేతకు వ్యతిరేకంగా,అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన ఆమె జీవితం యావత్ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని,ఆమె చూపిన తెగువ,ఆత్మగౌరవం నేటి తరాలకు మార్గదర్శకమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ ప్రెసిడెంట్ వెంకన్న, అక్కేనపల్లి శ్రీరాములు, తాందారి నాగయ్య, తాందారి సత్తయ్య, అనుముల శ్రీను,తాందారి సోమేశ్, తాందారి సతీష్, తాందారి శ్రీవాణి-వెంకటేష్,అరవింద్,నరేష్,గోవర్ధన్ , హరీష్, లింగయ్య,శంకరయ్య,శంకర్,నాగరాజు,సట్టు వెంకన్న,ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.

