గణనాథుడి గ్రామోత్సవంతో మార్మోగిన కోట దళితవాడ

నవపక్షం, గూడూర్ ప్రతినిధి:

కోట మండలంలోని కోట దళితవాడలో ఎసీసీ అంబేద్కర్ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి.వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణనాథుడి గ్రామోత్సవం భక్తిశ్రద్ధలు,యువత ఉత్సాహంతో అంగరంగ వైభవంగా సాగింది. టీడీపీ నేతలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి,షేక్ జలీల్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఎసీసీ అంబేద్కర్ క్రికెట్ యూత్ సభ్యులు ఇరువురు నేతలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ యువత ఐక్యంగా ముందుకు వచ్చి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గణనాథుడి ఆశీస్సులతో కోట దళితవాడతో పాటు గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామోత్సవంలో యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో దళితవాడలో పండుగ సందడి నెలకొంది.ఎసీసీ అంబేద్కర్ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ నౌషాద్,షేక్ శంషుధీన్, ఎ.సీ.సీ యూత్ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Hot this week

ACB వలలో నాంపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ప్రైవేటు వ్యక్తి

నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 28: వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదికను...

అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 28: డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక...

అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక వనరు...

పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మకు కాంగ్రెస్ నాయకుల నివాళి

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త,...

గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  స్వాతంత్ర్య సమరయోధుడు,విప్లవ కెరటం,షాహిద్ భగత్‌సింగ్ జయంతి...

Topics

తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్న బబ్లు

నవపక్షం,గూడూరు ప్రతినిధి :  తండ్రిపై తనకున్న ప్రేమను చాటుతూ తీపలపూడి బబ్లు తీసుకున్న...

శ్రీ ప్రగతి కాలేజి లో 40 మందిలో 10 మంది విద్యార్థులకు 9కి పైగా గ్రేడ్ పాయింట్లు

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: ఇటీవల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ...

చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.