నవపక్షం, చౌటుప్పల్, అక్టోబర్ 8:
మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్లు, మురుగునీటి కాలువలు, సాగునీరు, రైతులు, ఉపాధి, విద్య, వైద్యం వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం, అధికారులు తక్షణమే పరిష్కరించాలని బీసీవై పార్టీ తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మానవ హక్కుల పరిరక్షణ మండలి తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, మురుగునీటి కాలువలు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెండింగ్లో ఉన్న సాగునీటి పనులను పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని తెలిపారు.
యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరారు.
ప్రజా సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అత్యవసర సమస్యలకు తక్షణ పరిష్కారం, ఇతర సమస్యలకు గడువుతో కూడిన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.


