నవపక్షం, సిద్దిపేట జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు తన స్వగ్రామమైన కాశిరెడ్డిపల్లి గ్రామ ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు కేసీఆర్ గారి తాలూకా వ్యవస్థాపకురాలు కళ్యాణి యాదవ్ గారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో బతుకమ్మను ఒక శక్తివంతమైన సాంస్కృతిక వారధిగా మలుచుకొని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పామని గుర్తుచేశారు.
నాడు తెలంగాణ సాధన కోసం ఏకతాటిపైకి వచ్చిన సబ్బండ వర్గాల ప్రజలంతా, నేడు సామాజిక న్యాయం, సమానత్వం, సకల జనుల వికాసం, బహుజన సాధికారతతో కూడిన బంగారు తెలంగాణ సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా గౌరమ్మ తల్లి సాక్షిగా మనమంతా ఐకమత్యంతో పనిచేస్తూ, తెలంగాణ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా కేసీఆర్ గారు తిరిగి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని గౌరమ్మ తల్లిని ప్రార్థిద్దామని కళ్యాణి యాదవ్ గారు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆడబిడ్డలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మరోసారి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


