నవపక్షం, కోట ప్రతినిధి :
ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బహుజన యూత్ ఫోర్స్ కో-కన్వీనర్ యర్రబోతు నాగేంద్రబాబు, బహుజన ఉద్యమ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన మైక్ సెట్ కొనుగోలు నిమిత్తం రూ.20,000 ఆర్థిక సహకారం అందించారు.
కష్టపడి సంపాదించిన సొమ్ములో నుంచి బహుజన జాతి హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగుతున్న ఉద్యమానికి తన వంతు సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఆయన అందించిన విరాళం సంస్థ కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ ప్రతినిధులు యర్రబోతు నాగేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహకారం అందించాలని, నాగేంద్రబాబు సేవాభావం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.


