నవపక్షం, భువనగిరి ప్రతినిధి :
భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి దొనగిరి వేణు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా దొనగిరి వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తూ, జెండా మోస్తున్న సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు లభించడం లేదని విమర్శించారు. పార్టీ కోసం కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన నాయకులను పక్కనపెట్టి, పలుమార్లు పార్టీలు మారిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చుట్టూ కొంతమంది నాయకులు కోటరీగా ఏర్పడి, పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, గ్రామ శాఖ అధ్యక్షుడు బొట్టు మల్లేశం, మాజీ సర్పంచ్ చిందం మల్లిఖార్జున, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ గుమ్మడి సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ పోల ప్రవీణ్ గౌడ్, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకుడు వల్లపు విజయ్, వార్డు సభ్యులు దండెబోయిన బాలరాజు, సామల చంద్రమోహన్, కందాడి సంతోష్ రెడ్డి, కొండం శివ, చింతల నర్సిరెడ్డి, పల్లెపాటి నరసింహ, బొట్టు శేఖర్, కొంగల సాయి, రేపాక నరేష్, మచ్చ శివసాయి తదితరులు పాల్గొన్నారు.


