నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిది:
ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల ఎన్నికల సంబంధించి శనివారం మునుగోడు నియోజకవర్గ mlc ఎన్నికల ఇంచార్జీ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ శనివారం ఆత్మకూరు (S) కందగట్ల గ్రామానికి వచ్చిన సందర్భంగా రానున్న MLC ఎన్నికల కొరకు అధిక మొత్తంలో ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలని, బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు S మాజీ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తుడి నరసింహ రావు, మాజీ దండుమైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బెల్లంకొండ యాదగిరి గౌడ్ , మాజీ ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్ , మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణా రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


