నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిది:
ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను పకడ్బందీగా, వేగవంతంగా చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పీసీసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, నిర్ణీత గడువులోగా నమోదు పూర్తయ్యేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.పట్టణ, మండల స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వయంగా పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఒక్కరు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, నిరుద్యోగ పట్టభద్రులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తదితర అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదు విధానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పొందేలా చూడాలని పేర్కొన్నారు.


