Sunday, November 8, 2026

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాలి – రాష్ట్ర నీటి సరఫరా అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ

నవపక్షం, మండపేట ప్రతినిధి :  

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్ర నీటి సరఫరా అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని కోరారు.

​రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి కీలక స్థానాలు కేటాయించినట్లు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ వెల్లడించారు.

​కేటాయింపుల్లో భాగంగా మండపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానం, కపిలేశ్వరపురం మండల జెడ్పీటీసీ స్థానం, నియోజకవర్గ పరిధిలో 18 ఎంపీటీసీ స్థానాలు, మండపేట పట్టణంలో 10 మున్సిపల్ వార్డులు జనసేనకు కేటాయించినట్లు తెలిపారు.

​ఈ సందర్భంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు లీలాకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతో స్థానాల కేటాయింపు జరిగిందన్నారు. కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

​ప్రజలకు మరింత చేరువై స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి, ప్రజాసేవకు ప్రాధాన్యమిస్తామన్నారు. నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని లీలాకృష్ణ పిలుపునిచ్చారు.

Hot this week

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

Topics

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.