నవపక్షం, సూర్యాపేట :
సూర్యాపేట పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని మెప్మా (MEPMA) విభాగంలో అదనపు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి నివాసాలపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
గతంలో జీవీఎంసీతో పాటు నిజామాబాద్ నగరంలో కమిషనర్గా పనిచేసిన సదరు అధికారి ప్రస్తుతం హైదరాబాద్లో మెప్మా అదనపు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ఆయన స్వగృహంతో పాటు గాంధీనగర్లోని బంధువుల నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ సోదాలకు గల కారణాలు, అధికారులు పరిశీలిస్తున్న అంశాలు, తనిఖీల్లో ఏవైనా కీలక పత్రాలు లేదా ఇతర ఆధారాలు లభించాయా అనే విషయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏసీబీ అధికారుల ప్రకటన అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.


