Wednesday, November 11, 2026

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఉస్మానియాలో క్విజ్ పోటీలు

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : 

జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల క్విజ్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం, మేధో సామర్థ్యాన్ని వెలికితీయడం, సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో విశ్వవిద్యాలయానికి చెందిన 19 విభాగాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీల్లో లైబ్రరీ సైన్స్ విభాగం ప్రథమ బహుమతిని, జాగ్రఫీ విభాగం ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి. పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఫిలాసఫీ విభాగాధిపతి ప్రొఫెసర్ వంశీధర్, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ రవి బానోత్ వ్యవహరించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ అరుణ జ్యోతి స్వాగత ఉపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీం మాట్లాడుతూ.. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు క్రమశిక్షణతో పాటు విద్యా, విజ్ఞాన రంగాల్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించినా ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ముందువరుసలో నిలుస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా జనరల్ నాలెడ్జ్, సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి క్విజ్ పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, విశ్లేషణాత్మక ఆలోచన, సమయస్ఫూర్తి, పోటీ పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్విజ్ క్లబ్ సభ్యులు బెల్లం ఉదయ్, పిల్లి మహేష్, రామకృష్ణ, సోషియాలజీ ఉదయ్, వెంకట్, రఘుసాయి, వంశీ కృష్ణ, వినయ్, సుమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Hot this week

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన 20 కుటుంబాలు

  నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో...

ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

    నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి...

ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

నవపక్షం, నాంపల్లి ప్రతినిధి : నాంపల్లి: మండలంలోని సుంకిశాల గ్రామంలో ఎండిపోయిన వరి...

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

Topics

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.