ఎల్ నీనో ప్రభావంపై రైతు వేధిక లో అవగాహన సదస్సు

తేదీ 01/09/2026
గోరి కొత్తపల్లిమండలం:

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలపై సుల్తాన్పూర్ రైతు వేదికలో అవగాహన సదస్సు : అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి జి సారయ్య

గోరి కొత్తపల్లి సెప్టెంబర్ 1:(న్యూస్ 10)

ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని అధికారులు సూచించారు. ఆత్మ (ATMA) పథకం ఆధ్వర్యంలో సుల్తాన్‌పూర్ రైతు వేదికలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి తిరుపతి రైతులకు ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యాన పంటలు, కూరగాయల సాగుతో పాటు ఆయిల్‌పామ్‌ పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశాలపై వివరించారు.

కొత్తపల్లి గోరి వ్యవసాయ అధికారి జి సారయ్య మాట్లాడుతూ ప్రస్తుతం వరి మరియు పత్తి పంటలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు మరియు ముందస్తు వేసంగిలో పెసరు మినుము మరియు మొక్కజొన్న పంటలపై దృష్టి సారించాలని తెలిపారు

ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నేల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేకంగా వివరించారు.

అలాగే ఆయిల్‌పామ్‌ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, సాగు విధానం, మొక్కల ఎంపిక, నిర్వహణ పద్ధతులు, దిగుబడి తదితర అంశాలను రైతులకు వివరించారు. ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ పథకాల గురించి కూడా రైతులకు అవగాహన కల్పించారు.

రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాలని
అధికారులు కోరారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటల ఎంపికలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాడవేన సరిత యుగంధర్, ఆత్మా BTT మెంబర్ చిగురుమామిడి రజిత ఏఈఓ వి.దివ్య మరియు చిన్నకోడెపాక ఏ ఈ ఓ ప్రశాంత్,హెచ్ ఈ ఓ సురేష్ వెంకటేశ్వర్ల పల్లి సుల్తాన్పూర్ జగ్గయ్యపేట రైతులు బానోత్ మొగిలి పనాస రాంబాబు లక్కం రామస్వామి లక్కం తిరుపతి కేశవేనా సాంబయ్య గజ్జల్లి జలంధర్ దైనపల్లి వెంకటేశ్వర్లు చిగురుమామిడి రాజు పాల్గొనడం జరిగింది

Hot this week

భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి:  మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో...

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

Topics

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.