ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు నకిరేకల్‌లో భారీ బహిరంగ సభ.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నవపక్షం, నకిరేకల్, ప్రతినిధి:

ఈ నెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటన నేపథ్యంలో మినీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని, గత విధ్వంస పాలన నుంచి రాష్ట్రం వికాసం వైపు సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నకిరేకల్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.

గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి వంటి హామీలను గత ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడలేదని, వారు సభకు హాజరుకాకపోవడంతో దళిత నేతకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.