అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్: ఎంపీ బలరాంనాయక్ — వెయ్యి రోజుల్లో అభివృద్ధి చేసి చూపించాం: ఎమ్మెల్యే మురళీనాయక్

నవపక్షం, మహబూబాబాద్ ప్రతినిధి : 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని, పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మానుకోట ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 1000 రోజుల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అర్హులకు ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే, ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

వెయ్యి రోజుల్లో అభివృద్ధి చేసి చూపించాం: ఎమ్మెల్యే మురళీనాయక్

స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేయలేని అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో చేపట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.

మానుకోట మున్సిపాలిటీలో సుమారు రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రూ.7 కోట్లతో బంధం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడం, రూ.2 కోట్లతో మున్సిరు వాగు వద్ద బతుకమ్మ, వినాయక నిమజ్జన ఘాట్ నిర్మాణం, రూ.9 కోట్లతో దాశరథి స్మృతి వనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

త్వరలో 400 ఎకరాల్లో సుమారు రూ.1,000 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుందని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రూ.350 కోట్లతో జిల్లా కేంద్రానికి ఓఆర్‌ఆర్ రాబోతుందని, కేసముద్రంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

కేసముద్రంలో రూ.750 కోట్లతో అభివృద్ధి: సమ్మయ్య గౌడ్

కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

కేసముద్రం మండలంలో సుమారు రూ.750 కోట్ల నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీలు, రహదారులు, విద్య, సాగునీటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గడీల రాజ్యం కాదని, ప్రజల రాజ్యమని సమ్మయ్య గౌడ్ అన్నారు. నిధుల సాధనలో, సమస్యల పరిష్కారంలో కృషి చేస్తున్న వేం నరేందర్ రెడ్డికి కేసముద్రం ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలకు తాము క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

మండలంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరలో పూర్తి చేసి కేసముద్రంను మోడల్ మండలంగా తీర్చిదిద్దుతామని సమ్మయ్య గౌడ్ తెలిపారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ ఉమ, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు జ్యోతి, అర్బన్ అధ్యక్షుడు మనపురపు అంజయ్య, మండల అధ్యక్షుడు తెల్లంకొండ శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.