నవపక్షం,నారాయణపేట జిల్లా ప్రతినిధి :
నారాయణపేట జిల్లా పోలీస్అ సోసియేషన్ ఎన్నికల్లో జిల్లా జాయింట్ సెక్రటరీగా విజయం సాధించిన పోలీస్ కానిస్టేబుల్ మురళీకృష్ణను గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు కార్తీక్, సచిన్, విద్యుత్ శాఖకు చెందిన లింగం గౌడ్ ఘనంగా సన్మానించారు.
మురళీకృష్ణ నివాసానికి వెళ్లిన గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా విజయం సాధించడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సంపూర్ణ నిబద్ధతతో, కృషితో నిర్వహిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి నాయకులు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


