ఘనంగా ముగిసిన మండల స్థాయి క్రీడోత్సవాలు

నవపక్షం, మర్రిగూడ, సెప్టెంబర్ 3:

మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గత కొన్ని రోజులుగా ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి క్రీడోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. మర్రిగూడ మండల విద్యాశాఖాధికారి జి. శారద అధ్యక్షతన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు, జట్లకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు.
ఈ క్రీడోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కుదాబక్ష్‌పల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ పి. రవీందర్ రావు, ఆయన సోదరుడు ప్రేమేందర్ రావు సంపూర్ణ ఆర్థిక సహాయాన్ని అందించారు. విజేతలకు అందించిన బహుమతులను సైతం వారు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల క్రీడా వికాసానికి ముందుకు వచ్చిన దాతల ఉదారతను విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రూప్ సింగ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు రామతులసి, పీఎం శ్రీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉయ్యాల వెంకటేశం, కేజీబీవీ ఎస్‌ఓ జ్యోతి మాట్లాడారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని, క్రీడాస్ఫూర్తితో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో క్రీడల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు వాసుదేవరావు, జంగయ్య, నరసింహ, వేదవతి, రామ్ నరేష్,కళావతి, పవన్‌తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.