నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా, ధరూర్ మండలం, ఏబ్బనూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో గల్లీ గల్లీనా గణేష్ మండపాలు వెలసి భక్తి శోభ సంతరించుకున్నాయి.
ఇందులో భాగంగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ శివాలయ దేవాలయంలో వెలసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్, ధరూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ
గణేష్ ఉత్సవాలు అంటేనే ఐక్యతకు ప్రతీక. గ్రామంలోని అందరూ కులమతాలకు అతీతంగా, కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలి. యువత భక్తితో పాటు సేవా భావంతో ముందుకు సాగి, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. బొజ్జ గణపయ్య ఆశీస్సులతో మన ఏబ్బనూర్ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.


