నవపక్షం, మొయినాబాద్ మండల ప్రతినిధి :
మూర్తుజగూడ గ్రామానికి చెందిన మైనాబాద్ మున్సిపల్ అధ్యక్షులు మాదాపురం శ్రీకాంత్ , అండాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయంగా రూ.50,000/- (యాభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.
అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించిన మాదాపురం శ్రీకాంత్ కి అయ్యప్ప కమిటీ సభ్యుల తరఫున, గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ఆలయ నిర్మాణానికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో ఆలయ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని అయ్యప్ప కమిటీ సభ్యులు తెలిపారు.


