నవపక్షం, జుక్కల్ నియోజవర్గ ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండేకల్లుర్ గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ఆవరణంలో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ సావిత బాయి, ఉప సర్పంచ్ లాలయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ, వార్డు మెంబర్లు, ఉదయ్ పటేల్, షాదుల్, ప్రకాష్, పీరుగొండ తదితరులు పాల్గొన్నారు.


