దేశ సేవకుడు నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన రేగొండ బీజేపీ కార్యకర్తలు

నవపక్షం, రేగొండ మండల ప్రతినిధి : 

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిసిధర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు వెన్నంపేల్లి పాపయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయులనే తన కుటుంబంగా భావిస్తూ ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ అనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళ్లే లక్ష్యంతో మోదీ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం లక్ష్యంగా సాగుతున్న ప్రయాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లింగంపల్లి ప్రసాద్ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోల్సాని తిరుపతిరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికంటి రవి కిరణ్, జిల్లా నాయకులు బండారి రవి, మోత్కుపల్లి బుచ్చిరెడ్డి, కాంతాల సర్వోత్తమ్ రెడ్డి, గన్ రెడ్డి లింగారెడ్డి, జాలిగాపు రాజయ్య, సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి భానోత్ రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి తూర్పాటి మల్లేష్, మండల ఉపాధ్యక్షులు సర్వ కుమారస్వామి, ఎల్లావుల రాజు, బీజేవైఎం జిల్లా నాయకులు మాత శంకర్, కౌడగానే రాకేష్, మండల నాయకులు సామల సంతోష్, మేకల సాంబ రెడ్డి, మేకల రవీందర్, దేశ్మి రాజు, బూత్ అధ్యక్షులు చల్ల విక్రం, నిమ్మల రాజేశ్వరరావు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.