జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు.. – తెలంగాణ జర్నలిస్టుల జేఏసీ చైర్మన్ తొగరి కరుణాకర్

 

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 17 : 

2022లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన జర్నలిస్టుల అక్రీడియేషన్ లు నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో అక్రిడేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ తొగరి కరుణాకర్ ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా కరుణాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు జారీ చేసే అట్రిడియేషన్లు రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి మూడు సంవత్సరాలు గడుస్తున్నా పాత వాటిని గడుపు పొడిగిస్తూ కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల కోసం ఒక్క అంశం కూడా మాట్లాడడం లేదని, గడువు ముగిసిన అక్రిడేషన్లను గడువు పొడిగించి పోతున్నారే తప్ప కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయడం లేదని, అలాగే జర్నలిస్టులకు వారి వారి సంక్షేమం కోసం ఎంత బడ్జెట్ కేటాయించారో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని సూటిగా ప్రశ్నించారు. జర్నలిస్టులకు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వందకోట్ల బడ్జెట్ను కేటాయించారని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యల కోసమే తెలంగాణ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయిందని, త్వరలో హైదరాబాద్ కేంద్రంగా జేఏసీ జర్నలిస్టుల సమరభేరి కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుందని, జర్నలిస్టులకు కూడా రాష్ట్రవ్యాప్తంగా మూడు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. జర్నలిస్టుల కూడా ఎమ్మెల్సీ ఉన్నట్టయితే శాసనమండలిలో ప్రతి ఏటా జర్నలిస్టుల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం నుండి పొందేలా శాసనమండలిలో తమ గొంతుక వినిపిస్తామని పేర్కొన్నారు. మండలస్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి జర్నలిస్టులు వార్తలు రాయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల సమస్యలు ప్రభుత్వానికి ఎలా తెలుస్తాయని సూటిగా ప్రశ్నించారు. అదే జర్నలిస్టులకు ఎమ్మెల్సీలు ఉన్నట్లయితే శాసనమండలిలో తమ గోడు వినిపించేందుకు సులువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్టికల్ 175 (2) ప్రకారం జర్నలిస్టుల కూడా ఎమ్మెల్సీ స్థానాలు కల్పించే హక్కును రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పొద్దుపరిచారని గుర్తు చేశారు.4 ఏళ్ల గడువు ముగిసిన అక్రిడేషన్లను ఇప్పటివరకు కేవలం బస్సు పాసులు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విలేఖరి తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని ప్రభుత్వానికి చురకలాంటించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుండి జిల్లాల స్థాయి వరకు జర్నలిస్టులందరినీ ఒకే తాటిపై తీసుకువచ్చి జేఏసీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.