నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :
శాలిగౌరారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ వార్డు సభ్యుడు రాపాక రాజు తండ్రి రాపాక పెంటయ్య దశదినకర్మ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శాలిగౌరారం మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు అయితగోని వెంకన్న గౌడ్ హాజరై రాపాక రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాలిగౌరారం గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మల సురేష్, ఆకారం గ్రామ శాఖ అధ్యక్షుడు బైరాజు, బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు మహేశ్వరం వెంకన్న, బీఆర్‌ఎస్‌వీ నాయకుడు అశోక్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుండ్ల రవి, కప్పల అశోక్ తదితరులు పాల్గొన్నారు.


