నవపక్షం, పెందుర్తి మండల ప్రతినిధి :
పినగాడి గ్రామంలో ACDC యంగ్ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్నసంతర్పణ కార్యక్రమానికి తెలుగు యువత పెందుర్తి మండల అధ్యక్షులు BVV ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, ACDC యూత్ సభ్యులు BVV ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.
అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న BVV ప్రసాద్, కార్యక్రమ నిర్వాహకులు మండా చిట్టి, Bbm నాయుడు, నీలి వెంకటేష్, కండిపల్లి మనోజ్, ఆతవ సురేష్ తదితరులను, అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ACDC యూత్ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా BVV ప్రసాద్ మాట్లాడుతూ, యువత ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు, ప్రజలందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ACDC యంగ్ బాయ్స్ సభ్యులు ఎంతో ఉత్సాహంతో భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.
తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, ఆత్మీయంగా సన్మానించిన నిర్వాహకులకు BVV ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ACDC యూత్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రజలకు అన్నదానం చేయడం ద్వారా సేవా భావాన్ని చాటిచెప్పవచ్చని, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని BVV ప్రసాద్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు యువత సభ్యులు, గ్రామస్తులు, స్థానికులు, ACDC యూత్ సభ్యులు మరియు నిర్వాహకులు పాల్గొన్నారు.


