నవపక్షం, బాచుపల్లి ప్రతినిధి :
భారతీయ జనతా పార్టీ 274 బాచుపల్లి డివిజన్ అధ్యక్షురాలిగా మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావును నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు ఆదేశాల మేరకు మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు.
విజయలక్ష్మి సుబ్బారావు నియామకం పట్ల జిల్లా, నిజాంపేట్ సర్కిల్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి సుబ్బారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి 274 బాచుపల్లి డివిజన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తన నియామకాన్ని పురస్కరించుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా అభినందనలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, బాచుపల్లి డివిజన్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా పార్టీకి సేవ చేసే అవకాశంగా భావించి శక్తివంచన లేకుండా పనిచేస్తానని విజయలక్ష్మి సుబ్బారావు తెలిపారు.


