పాటే ఆయుధంగా.. గళమే గుర్తింపుగా మద్నూర్ యువ గాయని గల్కట్వార్ సంధ్యారాణి ప్రస్థానం

నవపక్షం, మద్నూర్ ప్రతినిధి:

మారుమూల గ్రామీణ ప్రాంతం, నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మద్నూర్ యువ గాయని గల్కట్వార్ సంధ్యారాణి తన గళంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ చదువును కొనసాగిస్తూనే జానపద కళను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.

మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సంధ్యారాణి తండ్రి సాయిలు ఆటో డ్రైవర్ కాగా, తల్లి సవిత వ్యవసాయ కూలీ. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పట్టుదలతో విద్యను కొనసాగించిన ఆమె 2021లో బిచ్కుందలో బీఈడీ, 2024లో కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతూనే పాటల రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంపై రూపొందించిన చైతన్య గీతాన్ని సంధ్యారాణి ఆలపించారు. మహిళా సాధికారతను చాటేలా సాగిన ఈ పాటకు అధికారులు, మహిళా సంఘాల నుంచి ప్రశంసలు లభించాయి.

అంతకుముందు ‘మోగిన నగారా – ఓటరు చైతన్య గీతాలు’ కార్యక్రమం ద్వారా ఓటు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే పాటలు ఆలపించారు. తెలంగాణ రచయితల వేదిక, ప్రజా గాయకుడు గద్దర్ రెండో వార్షికోత్సవ మహాసభల్లో పాటలు పాడి విమలక్క చేతుల మీదుగా సత్కారం పొందారు. అలాగే ‘రేలా రే రేలా’ కార్యక్రమంలో ‘బండెనుక బండి కట్టే’ పాటను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సంధ్యారాణి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ, కలెక్టర్ సి.పి. సాయి చైతన్య, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ గడుగు గంగాధర్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సాంస్కృతిక కళాకారుడు అష్టా గంగాధర్ తదితరులు ఆమెను అభినందించారు.

పేదరికాన్ని అధిగమిస్తూ విద్యతో పాటు జానపద కళను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న గల్కట్వార్ సంధ్యారాణి ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని స్థానికులు పేర్కొంటున్నారు. పట్టుదల, ప్రతిభ, కృషితో గ్రామీణ ప్రాంత యువత కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించవచ్చని ఆమె ప్రయాణం చాటుతోంది.

Hot this week

అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక వనరు...

పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మకు కాంగ్రెస్ నాయకుల నివాళి

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త,...

గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  స్వాతంత్ర్య సమరయోధుడు,విప్లవ కెరటం,షాహిద్ భగత్‌సింగ్ జయంతి...

తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్న బబ్లు

నవపక్షం,గూడూరు ప్రతినిధి :  తండ్రిపై తనకున్న ప్రేమను చాటుతూ తీపలపూడి బబ్లు తీసుకున్న...

గణనాథుడి గ్రామోత్సవంతో మార్మోగిన కోట దళితవాడ

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: కోట మండలంలోని కోట దళితవాడలో ఎసీసీ అంబేద్కర్ క్రికెట్...

Topics

శ్రీ ప్రగతి కాలేజి లో 40 మందిలో 10 మంది విద్యార్థులకు 9కి పైగా గ్రేడ్ పాయింట్లు

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: ఇటీవల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ...

చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు...

వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం

నవపక్షం, హైదరాబాద్‌ ప్రతినిధి :  ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.