చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి :

చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భానోత్ రాజు నాయక్ చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించి, ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారని బాధితులు ఆరోపిస్తున్నారు.
బాధితుల వివరాల ప్రకారం, రాజు నాయక్ అధిక వడ్డీ చెల్లిస్తానని, చిట్టీల ద్వారా మంచి రాబడి కల్పిస్తానని నమ్మబలికి లక్ష్మీ నాయక్ తండాతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు ఐదు గ్రామాలకు చెందిన ప్రజల నుంచి దాదాపు రూ.10 కోట్ల మేర డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గత ఐదు రోజులుగా రాజు నాయక్ గ్రామంలో కనిపించకపోవడం, ఆయనకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్‌ ఆఫ్‌లో ఉండటం, ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ వద్ద నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో తమ భవిష్యత్తు ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము కష్టపడి సంపాదించిన డబ్బులను అధిక వడ్డీ వస్తుందనే నమ్మకంతో రాజు నాయక్‌కు ఇచ్చామని, ప్రస్తుతం ఆ డబ్బులు తిరిగి అందకపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యామని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఈ వ్యవహారంపై బాధితులు ఇప్పటికే ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ నుంచి వసూలు చేసిన నగదు, చిట్టీలకు సంబంధించిన పత్రాలు, రశీదులు, బ్యాంకు లావాదేవీల వివరాలు తదితర ఆధారాలను పోలీసులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని బాధితులు పేర్కొన్నారు.
బాధితుల సమాచారం ప్రకారం, భానోత్ రాజు నాయక్ ప్రస్తుతం ఆత్మకూరు మండలం శెట్టిగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

బాధితుల డిమాండ్లు

ఈ వ్యవహారంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధితుల నుంచి ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేశారు, ఆ నగదు ఎక్కడికి మళ్లించబడింది, చిట్టీల నిర్వహణకు సంబంధించిన లావాదేవీలు ఏమిటి అనే అంశాలను పూర్తిస్థాయిలో విచారించాలని బాధితులు కోరుతున్నారు. అలాగే, చట్టపరమైన ఆధారాల మేరకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని, బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తాలను తిరిగి ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు

Hot this week

అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక వనరు...

పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మకు కాంగ్రెస్ నాయకుల నివాళి

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త,...

గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  స్వాతంత్ర్య సమరయోధుడు,విప్లవ కెరటం,షాహిద్ భగత్‌సింగ్ జయంతి...

తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్న బబ్లు

నవపక్షం,గూడూరు ప్రతినిధి :  తండ్రిపై తనకున్న ప్రేమను చాటుతూ తీపలపూడి బబ్లు తీసుకున్న...

గణనాథుడి గ్రామోత్సవంతో మార్మోగిన కోట దళితవాడ

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: కోట మండలంలోని కోట దళితవాడలో ఎసీసీ అంబేద్కర్ క్రికెట్...

Topics

శ్రీ ప్రగతి కాలేజి లో 40 మందిలో 10 మంది విద్యార్థులకు 9కి పైగా గ్రేడ్ పాయింట్లు

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: ఇటీవల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ...

వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం

నవపక్షం, హైదరాబాద్‌ ప్రతినిధి :  ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి...

మణిదీప్‌ జన్మదిన &నామకరణ వేడుకల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ చిత్రపటం బహూకరణ

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి :  కొమురం భీం ఆసిఫాబాద్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.