నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :
చౌటుప్పల్లో మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీల నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నేతలు చేపడుతున్న నిరసనలకు మద్దతుగా ఈ ధర్నా నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకుల అరెస్టులు, లాఠీచార్జీలను నిరసిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ శాఖ కమిటీలు , వార్డు నేతలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


