నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :
పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, మర్రిగూడలో ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ముందస్తు సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. డీజే సంగీతం, బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రకృతిపై ప్రేమను, పూల మొక్కల పట్ల మమకారాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. తంగేడు తదితర స్థానిక పూలు, ఆకులతో బతుకమ్మను అలంకరించడం ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతుందని వివరించారు. సంప్రదాయ పండుగల ద్వారా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్. కరుణాకర్, జి. సబిత, పి. శ్రీనివాస్, వి. దొరతి, జి. మాధురి, పి. లింగస్వామి, డి. భవాని, కె. నాగమనీషా, ఎన్. వెంకటయ్య, మహమ్మద్ రజియుద్దీన్, బి. సూర్యకుమారి, టి. అనురాధ, బి. కోమలి, జె. విజయ, సాజిద, యాదయ్య, శంకర్, నసరత్, చంద్రమౌళి, సమతా, వెంకటరమణ, లక్ష్మీ, రామ్ నరేష్, శ్రీహరి, కొండల్ తదితర ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


