నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :
మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


