నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :
అక్టోబర్ 25 ఎల్ నినో విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాలేంక వినోద్ కుమార్ కోరారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరూ తమవంతు సహకారాన్ని అందించాలన్నారు.ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని,ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కావున నీటిని వృధా చేయకుండా,పొదుపుగా వాడాలని,తక్కువ నీటితో పండే పంటలను రైతులు సాగు చేసుకోవాలన్నారు. అనారోగ్యాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ,తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందజేస్తున్న సలహాలు, సూచనలను రైతులు ప్రజలు పాటించాలని కోరారు.ఈవిపత్కర పరిస్థితులు ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలందరూ అండగా నిలువాలని అన్నారు.


